ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయస్థాయి వైద్యవిద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో బండి పాల్గొని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని […]
దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయస్థాయి వైద్యవిద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో బండి పాల్గొని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం బీజేపీ తీసుకుందన్నారు. దేశంలోని ఓబీసీలంతా మోదీకి రుణపడి ఉంటారని అన్నారు. తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.