కట్నంగా ఎడ్లబండి ఇచ్చిన అత్తింటివారు
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు గిఫ్ట్‌లుగా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు ఇస్తూ ఉంటారు. ఇక వధువు తరపు అత్తింటివారు అయితే వరుడికి కార్లు, బైక్‌లు లాంటివి ఇస్తూ ఉంటారు. తెలంగాణలోని కుమురం భీం జిల్లా జైనూరు మండలంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్తింటివారు వినూత్నంగా ఆలోచించి వరుడికి ఎడ్లబండిని కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త వైరల్‌గా మారింది. ఎడ్లబండిని కట్నంగా ఇవ్వడాన్ని చూసి పెళ్లికి వచ్చిన బంధువులు ఆశ్చర్యపోయారు. కుమురం భీం జిల్లా […]
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు గిఫ్ట్‌లుగా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు ఇస్తూ ఉంటారు. ఇక వధువు తరపు అత్తింటివారు అయితే వరుడికి కార్లు, బైక్‌లు లాంటివి ఇస్తూ ఉంటారు. తెలంగాణలోని కుమురం భీం జిల్లా జైనూరు మండలంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్తింటివారు వినూత్నంగా ఆలోచించి వరుడికి ఎడ్లబండిని కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త వైరల్‌గా మారింది.
ఎడ్లబండిని కట్నంగా ఇవ్వడాన్ని చూసి పెళ్లికి వచ్చిన బంధువులు ఆశ్చర్యపోయారు. కుమురం భీం జిల్లా జైనూరు మండలంలోని కాశీపటేల్‌గూడకు చెందిన నగేశ్‌కు నర్నూలు మండలం ఖైర్‌డాట్వా గ్రామానికి చెందిన రేణుకతో తాజాగా పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లిలో అత్తింటివారు వరుడికి ఎడ్లబండిని కట్నంగా ఇవ్వడం వెనుక ఒక కారణం వినిపిస్తోంది. నగేశ్ చదువు లేకపోవడంతో వ్యవసాయం చేస్తుంటాడు.
దీంతో అత్తింటివారు బాగా ఆలోచించి వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎడ్లబండిని కట్నంగా ఇచ్చారు. అత్తింటివారి ముందచూపుపై ప్రశంసలు వస్తున్నాయి.