బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా.. అంటున్న యూత్.. ఈ బైక్ క్రేజ్ వేరే లెవల్..
దిశ, శేరిలింగంపల్లి : బుల్లెట్.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుండి వచ్చే ఫైరింగ్.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్న వారు, రాజకీయంగా మంచిపట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అయితే కొన్నాళ్లకు […]
దిశ, శేరిలింగంపల్లి : బుల్లెట్.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుండి వచ్చే ఫైరింగ్.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్న వారు, రాజకీయంగా మంచిపట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అయితే కొన్నాళ్లకు బుల్లెట్ల డిమాండ్ తగ్గిపోయింది. ఆస్థానంలో మైలేజ్ ఇచ్చే బైక్స్, స్కూటీలా హవా నడిచింది. నిన్నా మొన్నటి వరకు స్కూటీలు, మైలేజ్ ఇచ్చే బైక్ లే విపరీతంగా సేల్ అయ్యేవి.
కానీ ఇప్పుడు మళ్లీ మార్కెట్ లో బుల్లెట్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ వాహనాలపై సినిమా పాటలు కూడా ఓ రేంజ్‌లో హిట్ అవుతున్నాయి. వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డ్ అంటూ ఓ హీరోయిన్ తన లవర్ మీద పాట పాడేస్తే.. ఇంకో ఐటమ్ సాంగ్ బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి అంటూ సాగుతుంది. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేతా పా వచ్చేతా పా అంటూ సాగుతున్న జానపద గేయం కోట్ల వ్యూస్ తో బుల్లెట్‌లా దూసుకుపోతోంది. ఇలా సినిమా వాళ్లు సైతం బుల్లెట్‌కు మరింత పాపులారిటీ తెచ్చారు. చాలామంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ధర ఎక్కువైనా పర్లేదు. బుక్ చేసుకున్నాక 4 నెలలకు వచ్చినా నో ప్రాబ్లం మాకు మాత్రం బుల్లెట్ కావాల్సిందే అంటున్నారు.
ఫుల్ డిమాండ్..
ప్రస్తుతం బుల్లెట్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. అలా అని ధరలు ఏమాత్రం తక్కువలేవు. ఇందులో బేసిక్ మోడల్స్ కొనాలన్నా లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక సెలక్టెడ్ మోడల్స్ అయితే ధరలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అయినా సరే డబ్బులు ఉన్నాయి బుల్లెట్ కొనేద్దాం అంటే కుదరదు. ఫైనాన్స్ లేకుండా, ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకుందామన్నా కనీసం మూడు నెలలు ఆగాలని చెబుతున్నారు షోరూం నిర్వాహకులు. కొత్తరకం మోడల్ అయితే మరో నెల, రెండు నెలల ఎదురుచూపులు తప్పనిసరి. అంత డిమాండ్ ఉంది వీటికి.
బుల్లెట్ నుండి ఏ బైక్ ను లాంఛ్ చేసినా వినియోగదారులు ఎగబడి కొనేస్తున్నారు. ఈమధ్య రాయల్ ఎన్ ఫీల్డ్ నుండి హెత్మర్ అనే మోడల్ రిలీజ్ అయ్యింది. దీన్ని కొనాలంటే కనీసం 4 నెలల ముందు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలట. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న బైక్స్ కు కూడా మినిమం నెల నుండి 2 నెలల ముందు బుక్ చేసుకుని వెయిట్ చేయాల్సి ఉంటుంది. బుల్లెట్ కొనాలంటే ఆమాత్రం ఓపిక అవసరం అంటున్నారు ఆయా షోరూంల నిర్వాహకులు.