ఓఆర్​ఆర్​కు ఇరువైపులా బఫర్​ జోన్​

దిశ, న్యూస్‌బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెంట ఇరు వైపులా ఉన్న 15మీటర్ల (50 ఫీట్ల) బఫర్ జోన్​గా హెచ్​ఎండీఏ ప్రకటించింది. బఫర్​ జోన్ ఏరియాలో ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు జరపకూడదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) బఫర్ జోన్ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్​లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉంటుందని హెచ్​ఎండీఏ స్పష్టం చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండిఏ […]

Update: 2020-07-29 10:02 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెంట ఇరు వైపులా ఉన్న 15మీటర్ల (50 ఫీట్ల) బఫర్ జోన్​గా హెచ్​ఎండీఏ ప్రకటించింది. బఫర్​ జోన్ ఏరియాలో ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు జరపకూడదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) బఫర్ జోన్ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్​లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉంటుందని హెచ్​ఎండీఏ స్పష్టం చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ హెచ్ఎండిఏ, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్), హైదరాబాద్ గ్రోత్ కారిడార్(హెచ్​జీసీఎల్) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయని ప్రైవేటు భూ యజమానులు ఓఆర్ఆర్ వెంట ఖచ్చితంగా బఫర్ జోన్ నిబంధనలను పాటించాల్సిందేనని కమిషనర్ అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు.

బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15మీటర్ల సెట్​బ్యాక్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, డెవలపర్స్, ప్రభుత్వ స్థానిక సంస్థలు(మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు) తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిర్దేశించిన బఫర్ జోన్​లో యూని పోల్స్, టెలికాం టవర్లు, పవర్ ట్రాన్స్​ఫార్మర్లు, డిష్ యాంటెనాలు కూడా ఉండడానికి వీలు లేదన్నారు. బఫర్ జోన్ పరిధిలోని కాంపౌండ్ వాల్స్(ప్రహరీ గోడలు), బారికేడింగ్ షీట్స్ వంటి వాటిని వెంటనే గుర్తించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే విధంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఓఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, హెచ్ జిసిఎల్ సీజీఎం రవీందర్ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News