కరోనా వైరస్‌పై బీటీఎస్ పాట!
దిశ, వెబ్‌డెస్క్: కొరియన్ పాప్ పాటలు వినే వారికి బీటీఎస్ బ్యాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను పొందిన ఈ అబ్బాయిల బ్యాండ్ కొత్తగా కరోనా వైరస్ పాండమిక్ మీద ఒక పాటను విడుదల చేసింది. ‘లైఫ్ గోస్ ఆన్’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అనుభవించిన వ్యథను చూపిస్తూనే, ఒక కొత్త రోజు తిరిగొస్తుందనే ఆశను కలిగించారు. పాండమిక్ వల్ల స్తంభించిన జీవితాలను చూపిస్తూనే, […]
దిశ, వెబ్‌డెస్క్: కొరియన్ పాప్ పాటలు వినే వారికి బీటీఎస్ బ్యాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను పొందిన ఈ అబ్బాయిల బ్యాండ్ కొత్తగా కరోనా వైరస్ పాండమిక్ మీద ఒక పాటను విడుదల చేసింది. ‘లైఫ్ గోస్ ఆన్’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అనుభవించిన వ్యథను చూపిస్తూనే, ఒక కొత్త రోజు తిరిగొస్తుందనే ఆశను కలిగించారు. పాండమిక్ వల్ల స్తంభించిన జీవితాలను చూపిస్తూనే, అందులోనే కొత్త ఆనందాన్ని వెతుక్కోవాలని చెప్పారు. జియోన్ జుంగ్ కూక్ దర్శకత్వం వహించిన ఈ వీడియోలో కొవిడ్‌కు ముందు తమ బ్యాండ్ ఎలా ఎంజాయ్ చేసేవారో, కొవిడ్ తర్వాత ఎలా ఇంటికే పరిమితమయ్యారనేది చూపించారు. దాదాపు పాట మొత్తం కొరియన్ భాషలోనే ఉన్నప్పటికీ వారి భావం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోరస్‌లో వచ్చే ఇంగ్లీష్ పదాలు మాత్రం ఒకింత ఊరటను కలిగిస్తాయి. కొరియన్ పాప్ పాటల అభిమానులకు భాషతో సంబంధం లేదనుకోండి, వారికి అర్థమైనా కాకున్నా హమ్ చేయడానికి మాత్రం ఈ పాటలు క్యాచీగా ఉంటాయి.