ప్రాణాలు తీసిన బావినీళ్ల పంచాయితీ
దిశ, హుస్నాబాద్: పొత్తుల బావి నీళ్లు పంట పొలానికి పెట్టుకునే విషయంలో వాగ్వాదం చోటు చేసుకొని హత్యలకు దారితీసిన ఘటన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అడిషనల్ ఎస్పీ సందెపోగు మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన గుగ్గిళ్లపు స్వరూప భర్త కనకయ్య, గుగ్గళ్లపు శ్రీనివాస్ లకు వంశపారంపర్యంగా వస్తున్న 6 ఎకరాల భూమిని చేరో మూడెకరాలు పంచుకున్నారన్నారు. స్వరూప భర్త కనకయ్య మృతి చెందడంతో […]
దిశ, హుస్నాబాద్: పొత్తుల బావి నీళ్లు పంట పొలానికి పెట్టుకునే విషయంలో వాగ్వాదం చోటు చేసుకొని హత్యలకు దారితీసిన ఘటన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అడిషనల్ ఎస్పీ సందెపోగు మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన గుగ్గిళ్లపు స్వరూప భర్త కనకయ్య, గుగ్గళ్లపు శ్రీనివాస్ లకు వంశపారంపర్యంగా వస్తున్న 6 ఎకరాల భూమిని చేరో మూడెకరాలు పంచుకున్నారన్నారు. స్వరూప భర్త కనకయ్య మృతి చెందడంతో తన కూతురు ఉసికే నిర్మలతో కలిసి 3 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు.
దీంతో ఈనెల 16న స్వరూప పొత్తుల బావి నుండి తన పంట పొలానికి నీళ్లు పెట్టుకున్న సమయంలో శ్రీనివాస్ అక్కడకు వచ్చిన స్వరూప, నిర్మల లతో గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరగడంతో కోపోద్రోక్తుడైన శ్రీనివాస్ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనపై నిర్మల భర్త ప్రవీణ్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి ఏ1 గుగ్గళ్లపు శ్రీనివాస్, ఏ2 తల్ల గుగ్గళ్లపు రాజవ్వ, ఏ3 గుగ్గళ్లపు మహేందర్ నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై సజ్జనపు శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.