తమ్ముడు 2 అన్న కూతురు 2 కూతురు1.. మెగా ఫ్యామిలీ పెళ్లిలపై పోస్టర్స్.. పరువు తీసుకున్న నాగబాబు

ఎదుటి వ్యక్తి వైపు ఒకవేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపే చూపిస్తాయి అనే విషయాన్ని నాగబాబు మర్చిపోయారు.

Update: 2024-03-01 07:11 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఎదుటి వ్యక్తి వైపు ఒకవేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపే చూపిస్తాయి అనే విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు మర్చిపోయారు. తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తన వైవాహిక జీవితంపై జగన్ చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్న అనుకుని.. తనకి మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు మాత్రమే అయ్యాయని.. మరి నాలుగో పెళ్లి ఎప్పుడైనది.. నాలుగో పెళ్ళాంగా నువ్వు రా జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనని ఆయనే కించపరుచుకున్నట్లు ఉన్నాయి..పైగా వైసీపీ నేతలకు పవన్ అవకాశం ఇచ్చినట్లు అయింది. అది చాలదు అన్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడి మాటలను సమర్ధిస్తున్నట్లు..అప్పట్లో తనకి బాగా నచ్చిన సినిమా అనే క్యాప్షన్ జోడించి పాత సినిమా వదిన పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇక నాగబాబు ట్వీట్ చూసి ఆగ్రహానికి గురైన వైసీపీ అభిమానులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా తమ్ముడు 2 అన్న కూతురు 2 కూతురు1 అనే క్యాప్షన్ జోడించి మావిడాకులు సినిమా పోస్టర్ ని పోస్ట్ చేస్తున్నారు. కాగా నాగబాబు చేసిన అనాలోచిత ట్వీట్ కారణంగా రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని తన కూతురు నిహారిక, అలానే తన అన్న చిరంజీవి కూతురు శ్రీజాని కూడా రాజాకీయ గొడవల్లోకి లాగినట్లైందని విశ్లేషకులు చెప్తున్నారు. 

Tags:    

Similar News