ఆ చైర్మన్ పేరుతో మెసేజ్‌లు.. చివరికి ఏమైందంటే?
దిశ, రాయలసీమ: తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని కొందరు దళారులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని భక్తులకు ఆశ కల్పించి నిలువునా ముంచేస్తున్నారు. టీటీడీ చైర్మన్ సిఫార్సు లేఖ ఇప్పిస్తామని చెప్పిన కొందరు దళారులు వైవీ సుబ్బారెడ్డి పేరుతో భక్తుల మెుబైల్‌కు మెసేజ్‌లు పంపారు. అందుకు గానూ వారి దగ్గర నుంచి రూ.8 వేలు వసూళ్లు చేశారు. అనంతరం వారి మెుబైల్స్‌కు సిఫార్సు లేఖలు పంపించారు. […]
దిశ, రాయలసీమ: తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని కొందరు దళారులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని భక్తులకు ఆశ కల్పించి నిలువునా ముంచేస్తున్నారు. టీటీడీ చైర్మన్ సిఫార్సు లేఖ ఇప్పిస్తామని చెప్పిన కొందరు దళారులు వైవీ సుబ్బారెడ్డి పేరుతో భక్తుల మెుబైల్‌కు మెసేజ్‌లు పంపారు. అందుకు గానూ వారి దగ్గర నుంచి రూ.8 వేలు వసూళ్లు చేశారు. అనంతరం వారి మెుబైల్స్‌కు సిఫార్సు లేఖలు పంపించారు. దీంతో బాధితులు చైర్మన్ కార్యాలయానికి వెళ్లగా అవి నకిలీ సిఫార్సులుగా తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 11 టికెట్ల కోసం దళారులు రూ.16 వేలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.