ఇండియాకు యూకే సాయం.. హీందీలోనే చెప్పిన బ్రిటిష్ హైకమిషనర్

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా విలయతాండవం, మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్లు, బెడ్‌ల కొరతతో భారత్ విలవిలలాడుతోంది. ఇటువంటి సమయంలో పాకిస్తాన్‌తో సహా ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ఇండియాలో కరోనా నివారణకు తమవంతుగా సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బ్రిటన్ కూడా ముందుకొచ్చింది. తొమ్మిది ఎయిర్‌లైన్ కంటెయినర్లలో 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లతో పాటు 495 […]

Update: 2021-04-26 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా విలయతాండవం, మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్లు, బెడ్‌ల కొరతతో భారత్ విలవిలలాడుతోంది. ఇటువంటి సమయంలో పాకిస్తాన్‌తో సహా ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ఇండియాలో కరోనా నివారణకు తమవంతుగా సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బ్రిటన్ కూడా ముందుకొచ్చింది. తొమ్మిది ఎయిర్‌లైన్ కంటెయినర్లలో 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లతో పాటు 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్‌ భారత్‌కు పంపనుంది. ఇందులో భాగంగానే మొదటి ప్యాకేజీ రేపటికి ఢిల్లీకి చేరుకోనున్నట్టు సమాచారం.

హీందీలో మాట్లాడిన బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్..

భారత్‌కు తమ వంతు సాయం చేస్తున్నట్టు అక్కడి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంపై బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ మొట్టమొదటి సారిగా హిందీలో మాట్లాడుతూ ఓ ట్విట్టర్‌లో వీడియోను పోస్టు చేశాడు. ‘కరోనా కష్ట కాలంలో భారత్‌కు బ్రిటిష్ తనవంతు సాయం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్‌, వెంటిలేటర్లను ఇండియాకు పంపేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా జయించడానికి కలిసికట్టుగా ముందుకు సాగుతాం.. అంటూ అలెక్స్ ఎలిస్ హిందీలోనే ప్రసంగించడం విశేషం.

Tags:    

Similar News