బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ కు కరోనా

లండన్: చైనాలో ప్రాణం పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యూరప్, అమెరికాలను అతలాకుతలం చేస్తున్నది. తాజాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ‘గత 24 గంటల్లో నాలో కరోనా లక్షణాలు పాక్షికంగా కనిపించాయి. టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు స్వచ్ఛంద ఏకాంతవాసంలో ఉన్నాను. అయితే కరోనాపై పోరును మాత్రం యథావిధిగా కొనసాగిస్తా.. ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తా’ అని ఆయన ట్విట్టర్ వేదికగా […]

Update: 2020-03-27 06:47 GMT

లండన్: చైనాలో ప్రాణం పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యూరప్, అమెరికాలను అతలాకుతలం చేస్తున్నది. తాజాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ‘గత 24 గంటల్లో నాలో కరోనా లక్షణాలు పాక్షికంగా కనిపించాయి. టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు స్వచ్ఛంద ఏకాంతవాసంలో ఉన్నాను. అయితే కరోనాపై పోరును మాత్రం యథావిధిగా కొనసాగిస్తా.. ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తా’ అని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మరొక వీడియో షేర్ చేస్తూ బ్రిటన్ వాసులను ఇంటికే పరిమితం కావాలని కోరారు. తాము తప్పకుండా కరోనాను జయిస్తామని పేర్కొన్నారు.

Tags : Coronavirus, Britain, pm, boris Johnson, positive

Tags:    

Similar News