పెళ్లి పీటలపైనే ఆ పని చేసిన వరుడు.. ఛీ కొట్టిన వధువు

దిశ, వెబ్‌డెస్క్ : కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలని ఎన్నో కలలు కంటుంటారు యువతులు. తమ స్నేహితుల భర్తల కంటే తన భర్తే ఐకాన్‌గా ఉండాలని ముచ్చట పడుతుంటారు. అలాంటి ఉహాలకు రెక్కలు తొడిగి పెళ్లి పీటలు ఎక్కిన వధువుకు ఊహించని షాక్ తగిలింది. మండపంలో పెళ్లి తంతు జరుగుతున్నా వరుడు గలీజ్‌గా వ్యవహరించడం పెళ్లి కూతురుకు నచ్చలేదు. పైగా ఆ పద్ధతి మంచిది కాదని హెచ్చరించినా వరుడు పట్టించుకోకపోవడంతో పెళ్లి పీటలు దిగిపోయింది. […]

Update: 2021-06-09 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలని ఎన్నో కలలు కంటుంటారు యువతులు. తమ స్నేహితుల భర్తల కంటే తన భర్తే ఐకాన్‌గా ఉండాలని ముచ్చట పడుతుంటారు. అలాంటి ఉహాలకు రెక్కలు తొడిగి పెళ్లి పీటలు ఎక్కిన వధువుకు ఊహించని షాక్ తగిలింది. మండపంలో పెళ్లి తంతు జరుగుతున్నా వరుడు గలీజ్‌గా వ్యవహరించడం పెళ్లి కూతురుకు నచ్చలేదు. పైగా ఆ పద్ధతి మంచిది కాదని హెచ్చరించినా వరుడు పట్టించుకోకపోవడంతో పెళ్లి పీటలు దిగిపోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలోని మిశ్రౌలి గ్రామానికి చెందిన ఓ యువతికి కేజూరి గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 5న వివాహం జరగాల్సి ఉంది. అదే రోజు వివాహ తంతుకు ఊరేగింపుగా వచ్చిన వరుడు నోట్లో గుట్కా నములుతూ వచ్చాడు. అలాగే నోటి నిండా గుట్కాలతో పెళ్లి పీటలు ఎక్కాడు. గుట్కా వాసన వచ్చిన వధువు చుట్టూ పరిశీలించగా.. తనకు కాబోయే భర్తే చూపరులకు చిరాకు పుట్టేలా గుట్కా నమలడాన్ని సహించలేకపోయింది. వెంటనే గుట్కా నమలడం ఆపాలని, నోరు శుభ్రం చేసుకోని రావాలని కోరింది. అయితే అతడు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే కూర్చోవడంతో చిర్రెత్తుకొచ్చిన వధువు పెళ్లి పీటలు దిగి వెళ్లిపోయింది.

పెళ్లి జరిగే వరకు కూడా గుట్కా నమలడం ఆపలేని ఈ వరుడు తనకు వద్దని తేల్చి చెప్పింది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌లో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. బంధువులు నచ్చచెప్పాలని చూసిన ఆమె వెనక్కి తగ్గలేదు. వివాదం జరుగుతున్న సమయంలో కూడా వరుడు అలాగే గుట్కా నములుతుండడంతో కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడలేకపోయారు. దీంతో పెళ్లికి వధువు కుటుంబం ఇచ్చిన కానుకలు తిరిగి ఇవ్వడంతో పెళ్లి రద్దు చేసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. వరుడు తెల్లముఖం వేసి గుట్కా నములుకుంటు బిక్కమొఖంతో వెనుదిరిగాడు.

Tags:    

Similar News