పెళ్లైన కాసేపటికే క్వారంటైన్‌కు!

పెళ్లి కనులపండువగా జరిగింది. దాదాపు 100 మందికిపైగా పెళ్లికి హాజరయ్యారు. అందరూ ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా ఓ వార్త పెళ్లికి వచ్చిన వారిని షాక్ గురిచేసింది. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే? కరోనా సోకిన ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యాడు. దీంతో వధూవరులు పెళ్లి జరిగిన కొన్ని గంటలకే క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అలాగే పెళ్లికి వచ్చిన బంధువులు దాదాపు 100 మందిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది. […]

Update: 2020-05-27 22:20 GMT

పెళ్లి కనులపండువగా జరిగింది. దాదాపు 100 మందికిపైగా పెళ్లికి హాజరయ్యారు. అందరూ ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా ఓ వార్త పెళ్లికి వచ్చిన వారిని షాక్ గురిచేసింది. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే? కరోనా సోకిన ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యాడు. దీంతో వధూవరులు పెళ్లి జరిగిన కొన్ని గంటలకే క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అలాగే పెళ్లికి వచ్చిన బంధువులు దాదాపు 100 మందిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన ఓ యువకునికి క‌రోనా సోకింది. అయితే అంత‌కు ముందు అత‌ను బంధువుల ఇంట్లో జ‌రిగే పెళ్లికి హాజ‌ర‌య్యాడు. ఈ ఘటనపై చింద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజేష్ షాహి మాట్లాడుతూ.. నాలుగు రోజుల క్రితం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ఆ యువకుడిలో కోవిడ్-19 లక్షణాలు క‌నిపించాయ‌న్నారు. దీంతో అత‌ని న‌మూనాల‌ను వైద్యప‌రీక్ష‌ల‌కు పంప‌గా, క‌రోనా పాజిటివ్ అని తేలిందన్నారు. అయితే ఇంత‌లోనే అత‌ను త‌న బంధువుల ఇంట జ‌రిగిన పెళ్లికి హాజ‌ర‌య్యాడ‌న్నారు. దీంతో వ‌ధూవ‌రుల‌తో పాటు పెళ్లికి హాజ‌రైన‌వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌న్నారు.

Tags:    

Similar News