మహిళా పంచాయతీ కార్యదర్శిపై లైంగిక వేధింపులు.. సర్పంచ్ భర్త ప్రతిరోజు..!

Update: 2022-02-09 14:01 GMT

దిశ, ఖానాపూర్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా పంచాయతీ కార్యదర్శి తనను సర్పంచ్ భర్త వేధిస్తు్న్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిల్వార్ పూర్ గ్రామంలో మమత పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. అదే గ్రామ సర్పంచ్ మిర్యాల హరిత భర్త మిర్యాల ప్రతాప్ రావు తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నడంటూ మమత ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. సర్పంచ్ భర్త తనను ప్రతిరోజు వేధింపులకు గురిచేస్తున్నారని.. ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె పేర్కొ్ంది. ఎంపీడీఓ ఈ విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌కు తెలియచేశారు. అనంతరం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. సర్పంచ్ భర్త ప్రతాప్‌‌పై కేసు నమోదు చేసి.. విచారిస్తున్నామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి చెప్పారు. బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలు తమకు అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News