మన్ కీ బాత్‌లో ఎన్టీఆర్‌కు ప్రధాని మోడీ నివాళి
మన్ కీ బాత్ 101 ఎపిసోడ్‌లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. ‘నా ప్రియమైన దేశప్రజలారా! రాజకీయాలలో, చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి
దిశ, డైనమిక్ బ్యూరో: మన్ కీ బాత్ 101 ఎపిసోడ్‌లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. ‘నా ప్రియమైన దేశప్రజలారా! రాజకీయాలలో, చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు నేను మీతో చర్చించబోతున్నాను. ఆయన మనందరికీ ఎన్టీఆర్ అనే పేరుతో కూడా తెలుసు. ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతి. ఆయన తన బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్‌గా నిలవడమే కాకుండా కోట్లాది ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నారు.
ఆయన 300కి పైగా సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలుసా? ఆయన తన నటన ఆధారంగా అనేక చారిత్రక పాత్రలకు జీవం పోశారు. భగవాన్ శ్రీ కృష్ణుడు, శ్రీరాముడు వంటి అనేక పాత్రలలో ఎన్టీఆర్ నటనని ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రజలు ఇప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారు. ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన ప్రజల నుండి చాలా ప్రేమ, ఆశీర్వాదం పొందారు. దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాది హృదయాలను ఏలిన రామారావుకు నా వినమ్రపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను’ అని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ వ్యాఖ్యానించారు.