BREAKING: వైసీపీ గెలుస్తుందని రూ.కోట్లలో పందెం.. కృష్ణా బ్యారేజీలో దూకి వ్యక్తి బలవన్మరణం

Update: 2024-06-12 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొంతమంది ప్రాణాలను బలితీసుకున్నాయి. రిజల్ట్స్ వెలువడక ముందు అత్యుత్సాహంతో వైసీపీ అభిమానులు పార్టీ గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. ఈ క్రమంలోని రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై జోరుగా చర్చ జరిగింది. అయితే, కొన్నిచోట్ల గెలుపు తమదంటే.. తమదేనని అధికార, ప్రతిపక్ష నాయకులు పరస్పర దాడులకు దిగారు. మరోవైపు పార్టీల గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా నడిచింది. ఎవడికి తోచినంత వారు అభిమాన పార్టీలపై బెట్టింగ్ కాస్తూ.. సర్వం పోగొట్టుకుని రోడ్డున పడిన వారు ఉన్నారు.. గెలిచి రూ.కోట్లు కూడబెట్టుకునోళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కడప-ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వెంకట సుబ్బారావు (52) అనే వ్యక్తి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ గెలుస్తుందని రూ.కోట్లల్లో పందేలు కాశాడు. అయితే, పందెం కాసిన వారందరికీ సుబ్బారావు మధ్యవర్తిగా ఉన్నాడు. కాగా, ఇటవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి సుబ్బారావు వెళ్లిపోయి విజయవాడ కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


Similar News