హైదరాబాద్‌కు వచ్చే గూడ్స్ వాహనాలకు బ్రేక్

దిశ, కుత్బుల్లాపూర్ : లాక్‌డౌన్ సమయంలో అత్యవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిబంధనలు అతిక్రమించే వారిని నియంత్రించేందుకు పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర, షాపూర్ నగర్, కొంపల్లి, దుండిగల్ రింగురోడ్డు, బాచుపల్లి […]

Update: 2021-05-22 04:59 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : లాక్‌డౌన్ సమయంలో అత్యవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిబంధనలు అతిక్రమించే వారిని నియంత్రించేందుకు పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర, షాపూర్ నగర్, కొంపల్లి, దుండిగల్ రింగురోడ్డు, బాచుపల్లి ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. శనివారం షాపూర్ నగర్ చౌరస్తాలో డీసీపీ పద్మజ, ఏసీపీలు పురుషోత్తం, గంగారెడ్డి, సీఐ బాలరాజుల ఆధ్వర్యంలోతనిఖీలు చేసి పదుల సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. అయితే నగరానికి భారీ వాహనాల తాకిడి అధికమవడంతో పోలీసు ఉన్నతాధికారులు నగరంలోకి అనుమించడంలేదు. అయితే రాత్రి సమయంలోనే గూడ్స్, భారీ వాహనాలకు అనుమతిస్తామని షాపూర్‌నగర్ వరకు వచ్చిన వాహనాలను తిప్పిపంపిస్తున్నా్రు.

Tags:    

Similar News