బ్రెజిల్ అధ్యక్షుడి హ్యాట్రిక్.. ముచ్చటగా మూడోసారి పాజిటివ్!

దిశ, వెబ్‌డెస్క్ :కరోనా విలయం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఓ వైపు కరోనా సోకి చికిత్స అనంతరం ఆరోగ్యంగా బయటపడిన వారిని కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. సాధారణంగా ఓ వ్యక్తికి ఒకటి, రెండుసార్లు వచ్చే కరోనా.. బ్రెజిల్ అధ్య‌క్షుడిని మాత్రం మూడోసారి కూడా వదలలేదు. ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే, లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆందోళనకు దిగి అప్పట్లో ఆయన వార్తల్లో నిలిచారు.. బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి తాండవం చేస్తుంటే.. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా […]

Update: 2020-07-22 21:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ :కరోనా విలయం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఓ వైపు కరోనా సోకి చికిత్స అనంతరం ఆరోగ్యంగా బయటపడిన వారిని కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. సాధారణంగా ఓ వ్యక్తికి ఒకటి, రెండుసార్లు వచ్చే కరోనా.. బ్రెజిల్ అధ్య‌క్షుడిని మాత్రం మూడోసారి కూడా వదలలేదు. ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే, లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆందోళనకు దిగి అప్పట్లో ఆయన వార్తల్లో నిలిచారు.. బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి తాండవం చేస్తుంటే.. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మ‌ద్దుతు తెలిపారు.. ఇలా వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు, వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడు వార్త‌ల్లో ఉండే అధ్య‌క్షుడే జైర్ బొల్సొనారో.
తాజాగా ఆయ‌న‌కు క‌రోనా సోకింది.. ఈ నెల 7న ఆయ‌న‌కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. నాటి నుంచి క్వారంటైన్‌లో ఉంటున్నారు. క్వారంటైన్ స‌మ‌యం ముగిసినా.. ఆయ‌న‌కు మ‌ళ్లీ పాజిటివ్‌గా వ‌చ్చింది. ఇప్పటికే రెండుసార్లు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవ్వడం.. తాజాగా మూడోసారి చేసిన పరీక్షల్లోనూ పాజిటివ్‌ వ‌చ్చిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. కాగా, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వివరించారు. వైద్యబృందం అనునిత్యం ఆయ‌న వెంటే ఉంటూ అన్ని జాగ్రత్తల‌ను తీసుకుంటోంద‌ని తెలిపారు.

Tags:    

Similar News