ఐసీఎంఆర్ సలహాదారుడిగా బీపీ ఆచార్య
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఆన్ బయో మెడికల్ రీసెర్చి విభాగానికి సలహాదారుడిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో నెలకొల్పనున్న ఆ విభాగం యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఫార్మా, బయోఫార్మా రంగాల్లో జరిగే ప్రీ క్లినికల్ యానిమల్ ట్రయల్స్ చేయడం ఈ యూనిట్ ప్రధాన ఉద్దేశం. […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఆన్ బయో మెడికల్ రీసెర్చి విభాగానికి సలహాదారుడిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో నెలకొల్పనున్న ఆ విభాగం యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఫార్మా, బయోఫార్మా రంగాల్లో జరిగే ప్రీ క్లినికల్ యానిమల్ ట్రయల్స్ చేయడం ఈ యూనిట్ ప్రధాన ఉద్దేశం.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జినోమ్ వ్యాలీకి ఆలోచన జరగడం మొదలు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేంతవరకు ప్రతీ దశలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన బీపీ ఆచార్య ఇప్పుడు అదే జినోమ్ వ్యాలీలో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే యూనిట్‌కు సలహాదారుగా నియమితులు కావడం విశేషం.