భూత వైద్యురాలితో యువకుడు ఎఫైర్.. అర్ధరాత్రి ఇద్దరు కలిసి గుట్టపై ఆ విధంగా..

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు అనడానికి ఈ మధ్య జరుగుతున్న ఎన్నో సంఘటనలు నిదర్శనం.. తాజాగా వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె దూరం పెట్టడంతో విసిగిపోయిన ప్రియుడు మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జిల్లాలోని మిడ్జిల్‌ మండలంలోని మల్లాపూర్‌‌లో చోటు […]

Update: 2021-11-03 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు అనడానికి ఈ మధ్య జరుగుతున్న ఎన్నో సంఘటనలు నిదర్శనం.. తాజాగా వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె దూరం పెట్టడంతో విసిగిపోయిన ప్రియుడు మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జిల్లాలోని మిడ్జిల్‌ మండలంలోని మల్లాపూర్‌‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి . కొన్ని రోజులు వీరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అయితే తర్వాత మహిళ అతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టింది. దీంతో వీరి మధ్య కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఒక రోజు మహిళతో ప్రేమగా మాట్లాడిన ఆయన పీర్లమాన్యం గుట్టలో బంగారు గనులు ఉన్నాయని వాటిని తీసుకుందామని మహిళను నమ్మించి రాత్రి గుట్టపైకి తీసుకెళ్లాడు. దీంతో అక్కడే మహిళపై అత్యాచారం చేసి, పెద్ద బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. అయితే ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఓ వ్యక్తి శీతా ఫలాల కోసం గుట్టపైకి వెళ్లాడు. దీంతో అక్కడ ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి షాకైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి ఆమె కనపడకుండా పోయిన లక్ష్మీ దేవిగా గుర్తించారు. ఘటనా స్ధలంలో ఉన్న ఆనవాళ్లను బట్టి ఆమపై అత్యాచారం జరిగిందని గుర్తించారు. ఒంటిపై గాయాలను బట్టి నిందితుడు హత్య చేసి ఉంటాడని నిర్ధారించుకుని ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మహిళ కాల్ డేటా ఆధారంగా నిందితున్ని పట్టుకొని అరెస్ట్ చేశారు.

పదో తరగతి విద్యార్థితో ఆంటీ రాసలీలలు.. ఆటోలోనే ప్లాన్ చేసి..!

Tags:    

Similar News