హెల్ప్ మీ అన్నందుకు రోడ్డుమీదనే కోరిక తీర్చుకున్న కామాంధుడు
దిశ, వెబ్డెస్క్: 22 ఏండ్ల యువతి ఊరి నుంచి ఒక్కతే బస్సు ప్రయాణం చేసి చివరకు స్టేషన్కు చేరుకుంది.. తోడు ఎవరూ లేరు.. లగేజ్ ఎక్కువగా ఉంది.. ఇదే సమయంలో చీకటి కూడా పడింది.. ఏం చేయాలో తోచలేదు. అసలే రోజులు మంచిగలేవని గ్రహించి.. బయటి వ్యక్తులను నమ్మలేక ఓ స్నేహితుడికి కాల్ చేసింది. తనను బస్టాప్ వద్ద డ్రాప్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేసింది. కానీ, ఆ ఫోన్ కాల్ ఆమె జీవితంలో చెరగని మరకను […]
దిశ, వెబ్డెస్క్: 22 ఏండ్ల యువతి ఊరి నుంచి ఒక్కతే బస్సు ప్రయాణం చేసి చివరకు స్టేషన్కు చేరుకుంది.. తోడు ఎవరూ లేరు.. లగేజ్ ఎక్కువగా ఉంది.. ఇదే సమయంలో చీకటి కూడా పడింది.. ఏం చేయాలో తోచలేదు. అసలే రోజులు మంచిగలేవని గ్రహించి.. బయటి వ్యక్తులను నమ్మలేక ఓ స్నేహితుడికి కాల్ చేసింది. తనను బస్టాప్ వద్ద డ్రాప్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేసింది. కానీ, ఆ ఫోన్ కాల్ ఆమె జీవితంలో చెరగని మరకను వేసింది. స్నేహితుడిని నమ్మి కారెక్కిన పాపానికి బాధిత యువతి నరకం అనుభవించింది. అసలేం జరిగింది.. ఆ స్నేహితుడు ఏం చేశాడో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరి.
పంజాబ్లోని బర్నాలకు చెందిన ఓ యువతి(22) పీజీ స్టూడెంట్. విద్యాభ్యాసం కొరకు మొహాలి జిల్లా జిరాక్పూర్లోని ఓ కళాశాలలో చదువుకుంటూ, సమీపంలోని హాస్టల్లో ఉంటోంది. ఇదే క్రమంలో సదరు యువతికి భటిండాకు చెందిన కుష్విందర్ సింగ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఇటీవల సొంత ఊరికి వెళ్లిన యువతి తిరిగి హాస్టల్కు బయల్దేరింది. ఇదే క్రమంలో మొహాలికి చేరుకునేసరికి చీకటి పడింది. వెంటనే కుష్విందర్కు కాల్ చేసి జిరాక్పూర్ బస్టాండ్ వరకు డ్రాప్ చేసేందుకు హెల్ప్ చేయాలని కోరింది.
ఫోన్ చేసిన నిమిషాల్లోనే..
సదరు యువతి కాల్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అక్కడికి వచ్చిన కుష్విందర్.. రాత్రి 8 గంటల ప్రాంతంలో కారు ఎక్కించుకున్నాడు. కారులో ఇద్దరే ఉండడంతో ఎలాగైనా తన కోరికను తీర్చుకునేందుకు ప్లాన్ వేసుకున్నాడు. వెంటనే జిరాక్పూర్ వెళ్లాల్సిన కారు రూట్ మార్చాడు. షార్ట్ కట్ రూట్ అంటూ నమ్మబలికి చివరకు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ యువతి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అనేలోపు ఓ గన్ తీసి బెదిరించాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తానంటూ.. నడిరోడ్డు మీదనే అత్యంత దారుణంగా రేప్ చేశాడు. తన పని పూర్తయ్యాక రాత్రి పూట బాధిత యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ షాక్ నుంచి తెరుకున్న యువతి వెంటనే సమీపంలోని రోడ్డు మీదకు పరుగులు తీసింది. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని హాస్టల్కు వెళ్లింది. మరుసటి ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులు చేసిన నేపథ్యంలో ఐపీసీ 376, 365,506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం.