వైరల్ అవుతున్న ‘బాయ్‌కాట్’.. ఎక్కడి నుంచి వచ్చిందంటే ?
దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయిన సందర్భంలో.. నెటిజన్లు ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు. ఈ మధ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మీద భారత్ ఓడిపోయినప్పుడు ‘బాయ్‌కాట్ ఐపీఎల్’ తెరమీదకు వచ్చింది. ఇలా ఏదైనా విషయంపై మన వ్యతిరేకతను తెలిపేందుకు బాయ్‌కాట్ పదాన్ని వాడుతుంటాం. ఇంతకీ ఆ పదం ఎక్కడ నుంచి ఉద్భవించిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏ దేశంలో పుట్టిందో మీకు తెలుసా? ఇంగ్లీష్ ల్యాండ్ ఏజెంట్ […]
దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయిన సందర్భంలో.. నెటిజన్లు ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు. ఈ మధ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మీద భారత్ ఓడిపోయినప్పుడు ‘బాయ్‌కాట్ ఐపీఎల్’ తెరమీదకు వచ్చింది. ఇలా ఏదైనా విషయంపై మన వ్యతిరేకతను తెలిపేందుకు బాయ్‌కాట్ పదాన్ని వాడుతుంటాం. ఇంతకీ ఆ పదం ఎక్కడ నుంచి ఉద్భవించిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏ దేశంలో పుట్టిందో మీకు తెలుసా?
ఇంగ్లీష్ ల్యాండ్ ఏజెంట్ కెప్టెన్ ‘చార్లెస్ కన్నింగ్‌హామ్ బాయ్‌కాట్’ ఓ మాజీ సైనిక అధికారి. సైన్యం నుంచి రిటైరైన తర్వాత ఐర్లాండ్, కౌంటీ మాయోలోని లాఫ్ మాస్క్ ప్రాంతంలో భూస్వామి లార్డ్ ఎర్న్‌కు ల్యాండ్ ఏజెంట్‌గా పనిచేశాడు. కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు చేయడం బాయ్‌కాట్ పని కాగా.. తనకు ఇష్టం వచ్చినట్లు అద్దె పెంచేసి, చెల్లించని ‘మాయో ఐరిష్ కమ్యూనిటీ’ టెనెట్స్‌ను అమానవీయంగా తొలగించేవాడు. ఇతని చర్యలను నిరసిస్తూ 1880లో ఐరిష్ భూ ఆందోళన మొదలైంది. బ్రిటిష్ ఎస్టేట్ మేనేజర్ చార్లెస్ కన్నింగ్‌హామ్ బాయ్‌కాట్‌పై ఐరిష్ అద్దెదారులు తిరగబడటంతో.. స్పందించిన ప్రభుత్వం భూస్వాముల పై చర్యలు తీసుకుంది. దీంతో బాయ్‌కాట్ డిసెంబరు 1, 1880న అవమానకరంగా ఐర్లాండ్‌ను విడిచిపెట్టాడు. ఈ ఘటన నుంచే నిరంకుశులను దించాలనే ప్రచారానికి అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే ఇంగ్లిష్ డిక్షనరీలో ‘బాయ్‌కాట్’ అనే పదానికి కారణమైంది.