బాలుడిని మింగిన ప్రహరీ గోడ

దిశ, దుగ్గొండి: క్షణకాలం ఏమరుపాటు ఓ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది. క్షణాల వ్యవధిలో బాలుడు విగతజీవిగా మారిన ఘటన మండలంలోని స్వామిరావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో జమలాపురం మమత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు సన్నీ(11) సీతా ఫలాల కొరకు జమలాపురం చిన్న సాంబయ్య ఇంటివద్ద ఉన్న ప్రహరీ గోడ ఎక్కాడు. సీతా ఫలాలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు ఆ గోడ బాలుడిపై కూలింది. స్థానికులు వెళ్లి చూడగా బాలుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు […]

Update: 2021-11-07 02:49 GMT
baludu-died1
  • whatsapp icon

దిశ, దుగ్గొండి: క్షణకాలం ఏమరుపాటు ఓ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది. క్షణాల వ్యవధిలో బాలుడు విగతజీవిగా మారిన ఘటన మండలంలోని స్వామిరావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో జమలాపురం మమత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు సన్నీ(11) సీతా ఫలాల కొరకు జమలాపురం చిన్న సాంబయ్య ఇంటివద్ద ఉన్న ప్రహరీ గోడ ఎక్కాడు. సీతా ఫలాలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు ఆ గోడ బాలుడిపై కూలింది. స్థానికులు వెళ్లి చూడగా బాలుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు గుర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు ఉన్నపళంగా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు సైతం వీరి రోదన చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News