ఇదీ నడుస్తున్న భారతం!

దిశ, వెబ్‌డెస్క్‌ : కరోనా వల్ల వలస బతుకులు అగమ్యగోచరంగా మారాయి. తిండిలేక, గూడులేక.. ఆదుకునే దిక్కులేక.. వందల మైళ్లు నడుచుకుంటూ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది మధ్యలోనే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంకెంతోమంది ఓపికలేక.. నీరసించి సొమ్మసిల్లుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైనే ప్రసవించిన తల్లులు దీనగాథలు హృదయాల్ని తల్లడిల్లేలా చేశాయి. చెప్పుల్లేక మండుటెండల్లో నడిచి నడిచి బొబ్బలెక్కిన చిన్నారుల కాళ్లను చూసి కరగని గుండె లేదు. ఇలా వారి ప్రయాణంలో ఎన్నో విషాదగాథలు. ఈ నేపథ్యంలో […]

Update: 2020-05-15 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్‌ : కరోనా వల్ల వలస బతుకులు అగమ్యగోచరంగా మారాయి. తిండిలేక, గూడులేక.. ఆదుకునే దిక్కులేక.. వందల మైళ్లు నడుచుకుంటూ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది మధ్యలోనే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంకెంతోమంది ఓపికలేక.. నీరసించి సొమ్మసిల్లుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైనే ప్రసవించిన తల్లులు దీనగాథలు హృదయాల్ని తల్లడిల్లేలా చేశాయి. చెప్పుల్లేక మండుటెండల్లో నడిచి నడిచి బొబ్బలెక్కిన చిన్నారుల కాళ్లను చూసి కరగని గుండె లేదు. ఇలా వారి ప్రయాణంలో ఎన్నో విషాదగాథలు. ఈ నేపథ్యంలో నడిచి నడిచి అలసిపోయి సూట్‌కేసుపైనే నిద్రించిన ఓ చిన్నోడి చిత్రం.. మరోసారి అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చిత్రంలో.. అమ్మనాన్నలతోపాటు ఊరి బాట పట్టిన ఓ చిన్న బాలుడు.. నడిచి నడిచి అలసిపోయాడు. పడుకోవడానికి ప్లేస్ లేదు. నడవడానికి ఒంట్లో ఓపిక లేదు. అమ్మనాన్నలిద్దరూ మూటాముల్లెలు మోస్తున్నారు. దీంతో ఆ బుడ్డోడు సూట్‌కేసుపైనే నిలబడి నిద్రపోతున్నాడు. ఇంటికెళ్లాలనే తొందరలో వాళ్లమ్మ కూడా ఆ సూట్ కేసుకు ఓ తాడుకట్టి లాక్కుని పోతోంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపమని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై నెటిజన్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెడతున్నారు. ఇలాంటి హృదయవిదారక సంఘటనలెన్నో జరుగుతున్నా ప్రభుత్వం కళ్లకు కనిపించడం లేదా? ఆత్మనిర్భర భారత్ అంటే ఇదేనా అంటూ ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News