భారత అథ్లెట్లకు ఏమైంది.. తృటిలో చేజారిన మరో పతకం

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు వరుసగా విఫలమవుతున్నారు. తాజాగా బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో పీవీ సింధు బంగారు పతకం ఆశలు గల్లంతవ్వగా రేపు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సింది ఉంది. అయితే, ఇటీవల బాక్సింగ్ విభాగంలో మేరీకోమ్ ఓడిపోగా, తాజాగా 75 కేజీల బాక్సింగ్ విభాగంలో మరో అథ్లెట్ పూజా రాణి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో చైనా ప్లేయర్ లీ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తే […]

Update: 2021-07-31 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు వరుసగా విఫలమవుతున్నారు. తాజాగా బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో పీవీ సింధు బంగారు పతకం ఆశలు గల్లంతవ్వగా రేపు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సింది ఉంది. అయితే, ఇటీవల బాక్సింగ్ విభాగంలో మేరీకోమ్ ఓడిపోగా, తాజాగా 75 కేజీల బాక్సింగ్ విభాగంలో మరో అథ్లెట్ పూజా రాణి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో చైనా ప్లేయర్ లీ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయింది.

కాగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు వెళ్లి పతకం ఆశలు సజీవంగా ఉండేవి. క్వాలిఫైయింగ్ మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన భారత అథ్లెట్లు పతకానికి దగ్గరకు దాకా వెళ్లి ఇంటి దారి పడుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తున్న అంశం.

Tags:    

Similar News