కొత్తగా 4 వేల షేరింగ్ స్కూటర్లు !: 'బౌన్స్'

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్కూటర్ షేరింగ్ స్టార్టప్ బౌన్స్ సంస్థ కొత్తగా 4వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా, 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని తెలిపింది. ఈ ఏడాది ఆరంభం నుంచే తాము గ్రీన్ మొబిలిటీకి మారుతున్నామని, ఫిబ్రవరి నెల నుంచి తాము ప్రవేశపెట్టిన ప్రతీ స్కూటర్ ఎలక్ట్రిక్‌దే అని కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకు సంస్థ వద్ద […]

Update: 2020-12-11 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్కూటర్ షేరింగ్ స్టార్టప్ బౌన్స్ సంస్థ కొత్తగా 4వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా, 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని తెలిపింది. ఈ ఏడాది ఆరంభం నుంచే తాము గ్రీన్ మొబిలిటీకి మారుతున్నామని, ఫిబ్రవరి నెల నుంచి తాము ప్రవేశపెట్టిన ప్రతీ స్కూటర్ ఎలక్ట్రిక్‌దే అని కంపెనీ పేర్కొంది.

ఇప్పటివరకు సంస్థ వద్ద 6వేల స్కూటర్లు ఉన్నాయని, వీటిలో 50 శాతం ఎలక్ట్రిక్ వేనని బౌన్స్ సీఈవో, సహ-వ్యవస్థాపకుడు వివేకానంద చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో సగం నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను బౌన్స్ ప్లాట్‌ఫామ్‌పై తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. గత నెలల్లో బౌన్స్ రోజువారి రైడింగ్‌లో స్థిరమైన పెరుగుదల నమోదవుతోందని, ప్రస్తుతం కరోనాకు ముందునాటి దాంట్లో 35 శాతానికి చేరుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, మైసూర్ సహా టైర్-2 మార్కెట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News