పార్లమెంట్ ఉభయసభలు అలా ప్రారంభం.. ఇలా వాయిదా!

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. అదేవిధంగా రాజ్యసభను 12.24 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజే ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అలా ప్రారంభమయ్యాయో లేదో అంతలోనే ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష […]

Update: 2021-07-19 01:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. అదేవిధంగా రాజ్యసభను 12.24 గంటల వరకు వాయిదా వేశారు.

ఈరోజే ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అలా ప్రారంభమయ్యాయో లేదో అంతలోనే ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తుండటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Tags:    

Similar News