ప్రమోషన్ వచ్చిన తెల్లారే లీవ్ అడిగాడు.. బాస్ రిప్లై చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దిశ, వెబ్‌డెస్క్ : ఓ ఉద్యోగి హార్డ్‌వర్క్‌ను యాజమాన్యం గుర్తించింది. అతనికి ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రమోషన్ వచ్చిన తెల్లారే బాస్‌ను ఆ ఉద్యోగి లీవ్ అడిగాడు. అందుకు బాస్ ఎలా స్పందించాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యానికి గురవ్వకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనరల్‌గా ప్రైవేట్ కంపెనీల్లో సెలవు అడిగితే బాస్ ఎలా స్పందిస్తారో ఉద్యోగులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకు లీవ్.. ఎటు […]

Update: 2021-03-30 03:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ ఉద్యోగి హార్డ్‌వర్క్‌ను యాజమాన్యం గుర్తించింది. అతనికి ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రమోషన్ వచ్చిన తెల్లారే బాస్‌ను ఆ ఉద్యోగి లీవ్ అడిగాడు. అందుకు బాస్ ఎలా స్పందించాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యానికి గురవ్వకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

జనరల్‌గా ప్రైవేట్ కంపెనీల్లో సెలవు అడిగితే బాస్ ఎలా స్పందిస్తారో ఉద్యోగులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకు లీవ్.. ఎటు వెళ్తున్నావ్.. పెండింగ్ వర్క్ చాలా ఉంది.. అదంతా ఎవరు కంప్లీట్ చేస్తారు.. లీవ్ కోసం దగ్గరికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు.. నా పని నన్ను చేసుకోనివ్వు.. అలానే వెళ్ళి నీ పని నువ్వు చూసుకో.. ఇలాంటి రిప్లైలు మేనేజ్‌మెంట్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి. కానీ, ఈ బాస్ మాత్రం అందరికీ తెగ నచ్చేశాడు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అది కూడా ఏ బాస్ వినకూడని కారణం చెప్పినా సెలవు మంజూరు చేశాడంటే.. అలాంటి బాస్‌ మెంటాలిటీ, పాజిటివ్ నేచర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రతీ ఒక్క బాస్ తన ఎంప్లాయితో ఇలాంటి మంచి రిలేషన్ షిప్ కొనసాగిస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఇంతకూ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తమ ఉద్యోగి హార్డ్‌వర్క్ గుర్తించిన యాజమాన్యం అతనికి ప్రమోషన్ ఇవ్వడంతో ఆరోజు అతను మిత్రులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. వాట్సాప్ స్క్రీన్ షాట్ ప్రకారం..” ‘‘గుడ్ మార్నింగ్ బాస్.. ఇలా అడుగుతున్నందుకు క్షమించండి, కానీ ఈ రోజు నేను సెలవు తీసుకోవచ్చా? గత రాత్రి ఫుల్లుగా పార్టీ చేసుకున్నాను. అతిగా తాగడంతో హ్యంగోవర్‌గా ఉంది. కుక్కలాగా పడుకునే ఉన్నాను. టైం గడుస్తున్నది తెలియడం లేదు. ఆ అనుభూతిలో ఉన్నాను. కావున, నేను ఈరోజు సెలవు తీసుకుంటాను’’.. అని మెసెజ్ పెట్టాడు.

ఉద్యోగి నిజాయితీ, హిలేరియస్ కామెడీని తలపించడంతో యజమానిని అది అట్రాక్ట్ చేసింది. ‘‘ఖచ్చితంగా, మీరు దీనికి పూర్తిగా అర్హులు. మీ రికార్డు ప్రకారం మీకు సెలవు అవసరం.. మీరు చెప్పిన కారణం ఎప్పటికి గొప్పదే’’.. అని బదులిచ్చాడు బాస్. ఉద్యోగి పట్ల యాజమాని నమ్మకం కలిగియుంటే అందుకు పది రెట్లు అతని నుంచి తిరిగి పొందుతాడని ఒకరు కామెంట్ చేశారు.

Tags:    

Similar News