‘ఇస్లామ్ వెలుగు’ పుస్తకావిష్కరణ

దిశ, న్యూస్‌బ్యూరో: యువ రచయిత మహమ్మద్ ముజాహిద్ రచించిన ‘ఇస్లామ్ వెలుగు’ పుస్తకాన్ని జమాతే ఇస్లామీహింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హామిద్ మహమ్మద్ ఖాన్ ఆవిష్కరించారు. శుక్రవారం ఛత్తాబజార్‌లోని ఆ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఆవిష్కరణ సభ జరిగింది. ఖురాన్ బోధనల సారాన్ని సరళమైన తెలుగులో ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని మౌలానా అభిప్రాయపడ్డారు. ఇల్లు, ఉద్యోగం, అలవాట్లు, వ్యాపారం, రాజకీయం ఇలా అన్నిరంగాలనూ ఇస్లామ్ ధర్మ బోధనలు మార్గదర్శకం చేస్తాయని మౌలానా చెప్పారు. పరిపూర్ణ […]

Update: 2020-08-14 07:13 GMT
‘ఇస్లామ్ వెలుగు’ పుస్తకావిష్కరణ
  • whatsapp icon

దిశ, న్యూస్‌బ్యూరో: యువ రచయిత మహమ్మద్ ముజాహిద్ రచించిన ‘ఇస్లామ్ వెలుగు’ పుస్తకాన్ని జమాతే ఇస్లామీహింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హామిద్ మహమ్మద్ ఖాన్ ఆవిష్కరించారు. శుక్రవారం ఛత్తాబజార్‌లోని ఆ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఆవిష్కరణ సభ జరిగింది. ఖురాన్ బోధనల సారాన్ని సరళమైన తెలుగులో ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని మౌలానా అభిప్రాయపడ్డారు. ఇల్లు, ఉద్యోగం, అలవాట్లు, వ్యాపారం, రాజకీయం ఇలా అన్నిరంగాలనూ ఇస్లామ్ ధర్మ బోధనలు మార్గదర్శకం చేస్తాయని మౌలానా చెప్పారు. పరిపూర్ణ వ్యక్తిత్వానికి ముహమ్మద్ ప్రవక్త బోధనలు దోహదపడతాయని, జీవితాన్ని అర్థవంతంగా మార్చడంలో ఖురాన్ బోధనలు దిశానిర్దేశం చేస్తాయని మౌలానా అన్నారు. కార్యక్రమంలో తెలుగు ఇస్లామిక్ ప్రచురణల డైరెక్టర్ ముహమ్మద్ అజహరుద్దీన్, గీటురాయి పత్రిక సంపాదకులు అబ్దుల్ వాహెద్ పాల్గొన్నారు.

Tags:    

Similar News