ఎమ్మెల్యే బేతిపై బొంతు రామ్మోహన్ భార్య సంచలన ఆరోపణలు…
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని, మహిళ కార్పొరేటర్ ను అని కనీస గౌరవం ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త , మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను సాధించలేక నాపై కుట్రలు చేస్తున్నారని, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనను ఓడించాలని వ్యతిరేకంగా పనిచేసిన పది మందిని నాపైకి ఊసిగోల్పుతున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని, మహిళ కార్పొరేటర్ ను అని కనీస గౌరవం ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త , మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను సాధించలేక నాపై కుట్రలు చేస్తున్నారని, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనను ఓడించాలని వ్యతిరేకంగా పనిచేసిన పది మందిని నాపైకి ఊసిగోల్పుతున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్పొరేటర్ బోంతు శ్రీదేవి ఓ ప్రకటన విడుదల చేశారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి నాపై తరచుగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలిపారు. మహిళ కార్పొరేటర్ అన్న గౌరవం కానీ సానుభూతి గానీ లేకుండా ప్రతి చోట నన్ను అవమానపరుస్తూనే ఉన్నాడని, అయినా భరిస్తూ వచ్చానని అవేదన వ్యక్తం చేశారు.
నాభర్తను సాధించలేకనే నాపై కుట్ర..
ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నా భర్త, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అధిష్టానం నిర్ణయం మేరకు తప్పుకున్న విషయం మీ అందరికీ తెలిసిందేనన్నారు. నా భర్తను సాధించలేక నాటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మహిళనని కూడా చూడకుండా ఏదో రకంగా నన్ను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తూ అవమానపరుస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు.. చర్లపల్లి డివిజన్ లో నా ఓటమి కోసం పనిచేసిన కొంతమందిని చేరదీసి, వారిని నాపైకి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.. డివిజన్ కార్పొరేటర్ గా నాకు కనీస సమాచారం లేకుండానే డివిజన్ లో అభివృద్ధి, సమస్యల పరిశీలనలు చేస్తూ అధికారులను పార్టీ శ్రేణులను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
అధికారిక కార్యక్రమాలకు నిర్ణయించిన సమయానికి రాకుండా, తన ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి నేను లేకుండానే ప్రారంభోత్సవాలు చేసి అవమాన పరుస్తాడని అవేదన వ్యక్తంచేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్ లోనూ తలెత్తిన సమస్యలు చర్లపల్లి లోనే ఎందుకు తలెత్తుతున్నాయని ప్రశ్నించారు.అన్ని డివిజన్ల కార్పోరేటర్ లను కలుపుకొని పని చేస్తున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మహిళను అన్న సానుభూతి లేకుండా నాపై కుట్రలు పన్నుతూ కక్షపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు.తొందరపడవద్దు అన్నీ సర్దుకుంటాయని ఓపిక పట్టినప్పటికీ ఏలాంటి హోదా లేని వ్యక్తులు ఎమ్మెల్యే అండతో నన్ను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలనే నిర్ణయించుకున్నా..
ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అగడాలు, అరాచాకాలను పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని బోంతు శ్రీదేవి స్పష్టం చేశారు. నాకు జరిగిన అవమానాలు నాపై చేస్తున్న కుట్రలను మంత్రి కేటీఆర్ దృష్టికి నేరుగా తీసుకెళ్లాలని భావిస్తున్నానని తెలిపారు.శుక్రవారం (ఈ నెల 2న) తాను నాగార్జుననగర్ కాలనీ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉండగానే నాకు కనీస సమాచారం లేకుండా చర్లపల్లి లో సీఎం క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వెళ్లారని. ఈ కార్యక్రమంపై డివిజన్ కార్పొరేటర్ గా నాకు కనీస సమాచారం లేదన్నారు. చర్లపల్లి బస్తీ దవాఖానలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు మేయర్ వస్తున్న విషయం తెలిసిన ఎలాంటి హోదా లేని ఎమ్మెల్యే అనుచరులు బస్తీ దవాఖానలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి మేయర్ ను అవమాన పరిచిన విషయం మీ అందరికీ తెలిసిందేనన్నారు. ఈసీ నగర్ లో గణేష్ టెంపుల్ షాపింగ్ కాంప్లెక్స్ 10 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా, తొమ్మిదిన్నర గంటలకు నేను లేకుండానే ప్రారంభించి వెళ్ళాడని, ‘కార్పొరేటర్ శ్రీదేవి మేడం వస్తున్నారు సార్’ అని నిర్వాహకులు చెప్పిన ఎవరికీ మేడం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రారంభించి వెళ్ళాడని గుర్తుచేశారు. ఇలా సొంత పార్టీ మహిళ కార్పొరేటర్ పైనే ఎమ్మెల్యే ఇలా వ్యవహారించడం సరికాదని శ్రేదేవి అవేదన వ్యక్తంచేశారు.