రాష్ట్రం పరువు తీసిన జగన్ : బొండా ఉమ

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఫొన్ ట్యాపింగ్ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు, న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వలన దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయిందని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరిగిన సమయంలో పట్టించుకోని డీజీపీ.. రాష్ట్రంలో ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని ప్రధాని మోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయగానే స్పందించటం హాస్యాస్పదంగా […]

Update: 2020-08-21 04:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఫొన్ ట్యాపింగ్ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు, న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వలన దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయిందని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరిగిన సమయంలో పట్టించుకోని డీజీపీ.. రాష్ట్రంలో ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని ప్రధాని మోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయగానే స్పందించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఏపీలో మద్యం షాపులకు లేని కొవిడ్‌ నిబంధనలు వినాయక చవితి వేడుకలకు ఎలా వర్తిస్తాయని బొండా ఉమ ప్రశ్నించారు. వైన్ షాపులకు ఇచ్చిన ప్రాధాన్యత హిందువుల తొలి పండుగ వినాయక చవితికి ఎందుకు ఇవ్వటం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల ముందు డ్వాక్రా గ్రూపులకు రూ.7లక్షలు ఇస్తామని ప్రకటించిన జగన్.. అందలం ఎక్కకా మరిచిపోయాడని మండిపడ్డారు.

అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాస స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ విచారణ జరిపించాలని.. పేదల ఇళ్ల స్థలాల పంపిణీని టీడీపీ అడ్డుకుంటుందని వైకాపా చేస్తున్న విష ప్రచారంపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని బొండా సవాల్ విసిరారు. సీఎం జగన్ కావాలనే తమ ఫొన్లు ట్యాప్ చేపిస్తున్నారని.. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ నడుస్తోందని.. దీంతో రాష్ట్రం పరువు పోయిందని విమర్శించారు.

Tags:    

Similar News