’డ్రగ్స్ దిగుమతికి ప్రభుత్వం సపోర్ట్.. సీఎం ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలి’
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దందా జరుగుతోందని తెలుగుదేశం నాయకుడు బోండా ఉమా ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసే డ్రగ్స్ దందా జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డీఆర్ఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారని… డ్రగ్స్ దందాలో తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలని అన్నారు. దేశంలోకి […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దందా జరుగుతోందని తెలుగుదేశం నాయకుడు బోండా ఉమా ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసే డ్రగ్స్ దందా జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డీఆర్ఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారని… డ్రగ్స్ దందాలో తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలని అన్నారు. దేశంలోకి వచ్చిన 70 వేల కోట్ల హెరాయిన్ ఎక్కడికి వెళ్లింది. ఇంతవరకు డ్రగ్స్ దందాపై ఎందుకు విచారణ చేయట్లేదని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నడుస్తుంటే రాష్ర్ట డీజీపీ ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రశ్నించారు.