సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు గోపాలపురం ఠాణాకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుతుందని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్​ స్క్యాడ్‌ టీంతో రైల్వేస్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు రాత్రి పది నుంచి 11 గంటల వరకూ తనిఖీలు కొనసాగాయి. ఎక్కడ బాంబు లేదని నిర్ధారణ కావడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నంతసేపు స్టేషన్​ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. అయితే ఫోన్​ ఎవరు చేశారు, ఎందుకు చేశారు […]

Update: 2020-02-23 21:46 GMT

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు గోపాలపురం ఠాణాకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుతుందని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్​ స్క్యాడ్‌ టీంతో రైల్వేస్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు రాత్రి పది నుంచి 11 గంటల వరకూ తనిఖీలు కొనసాగాయి. ఎక్కడ బాంబు లేదని నిర్ధారణ కావడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నంతసేపు స్టేషన్​ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. అయితే ఫోన్​ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read also..

ఇట్స్ టైం ఫర్ ‘పట్టణ ప్రగతి’

Full View

Tags:    

Similar News