అన్నీ మూసుకుని కూర్చొండి.. నెటిజన్లపై సింగర్ ఫైర్

దిశ, సినిమా: బాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ నేహా భాసిన్.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తనతో పాటు కుటుంబంపై కూడా ద్వేషపూరిత, అసభ్యకరమైన కామెంట్స్‌ చేయడంపై ఆమె ఫైర్ అయింది. ‘నన్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న అందరికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. మీరందరూ నన్ను చూసి భయపడుతున్నారు. ఇది నా టైమ్ లైన్.. మీ టాయిలెట్ కాదు. ముందు మీ పని‌మీద ఫోకస్ చేయండి. […]

Update: 2021-11-01 04:40 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ నేహా భాసిన్.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తనతో పాటు కుటుంబంపై కూడా ద్వేషపూరిత, అసభ్యకరమైన కామెంట్స్‌ చేయడంపై ఆమె ఫైర్ అయింది. ‘నన్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న అందరికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. మీరందరూ నన్ను చూసి భయపడుతున్నారు. ఇది నా టైమ్ లైన్.. మీ టాయిలెట్ కాదు. ముందు మీ పని‌మీద ఫోకస్ చేయండి. మీరు నన్ను ఎంతగా అసహ్యించుకున్నా.. నా లైఫ్, నా కెరీర్ కొంచెం కూడా మారదు. మీరు నోటితో పాటు అన్ని మూసుకుని కూర్చొండి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో రాసుకొచ్చింది. అయితే బిగ్ బాస్ -15లో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ప్రచారం కావడమే.. ఈ ట్రోలింగ్‌కు కారణం.

Tags:    

Similar News