బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అసిఫ్ బస్ర (53) గురువారం మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌, కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్ సమీపంలో గల తన అపార్టుమెంట్‌లో ఆయన మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. అయితే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బస్ర గత ఐదేళ్లుగా అదే అపార్టుమెంట్‌లో నివాసముంటున్నట్లు అపార్టుమెంట్‌వాసులు తెలిపారు. సీనియర్‌ పోలీసు అధికారులు, […]

Update: 2020-11-12 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్:
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అసిఫ్ బస్ర (53) గురువారం మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌, కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్ సమీపంలో గల తన అపార్టుమెంట్‌లో ఆయన మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. అయితే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బస్ర గత ఐదేళ్లుగా అదే అపార్టుమెంట్‌లో నివాసముంటున్నట్లు అపార్టుమెంట్‌వాసులు తెలిపారు.

సీనియర్‌ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృంద సభ్యులు దర్యాప్తు ప్రారంభించారని పోలీసు ఉన్నతాధికారి విముక్త్ రంజన్ వెల్లడించారు. యూకేకు చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న అసిఫ్‌.. తన పెంపుడు కుక్క గొలుసుతోనే ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక సమాచారం. టీవీ నటుడిగా ప్రసిద్ధి చెందిన అసిఫ్ ‘పర్జానియా, బ్లాక్ ఫ్రైడే’ లాంటి పలు బాలీవుడ్‌ మూవీలతో పాటు హాలీవుడ్ మూవీ ‘అవుట్‌సోర్స్‌’లోనూ నటించారు. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్‌ ముంబై’లో ఇమ్రాన్‌ హష్మీ తండ్రిగా నటించిన అసిఫ్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కై పో చే’ మూవీతో పాటు ‘హిచ్ కీ, క్రిష్-3, జబ్ వీ మెట్’ సినిమాల్లోనూ నటించారు. ఆయన చివరగా హోస్టేజెస్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు.

అసిఫ్ బస్ర మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది చేదువార్తని, నిజం కాకుడదని కోరుకుంటున్నాని డైరెక్టర్ హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. నమ్మశక్యం కావడం లేదని, లాక్‌డౌన్‌కు ముందే ఆయన్ను కలిశానని నటుడు మనోజ్ బాజ్‌పేయి అన్నారు.

Tags:    

Similar News