బాలీవుడ్ నిర్మాత కూతుళ్లకు కరోనా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగర్ కనికా కపూర్ కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిందన్న వార్తతో బాలీవుడ్ ఖుష్ అయినంతలోనే .. నిర్మాత కరీమ్ మొరానీ కూతురు షాజా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమెను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షాజాకు కరోనా సంక్రమించిందన్న వార్తతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్‌లు చేశారు వైద్య సిబ్బంది. ఈ పరీక్షల్లో ఆమె సోదరి […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగర్ కనికా కపూర్ కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిందన్న వార్తతో బాలీవుడ్ ఖుష్ అయినంతలోనే .. నిర్మాత కరీమ్ మొరానీ కూతురు షాజా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమెను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షాజాకు కరోనా సంక్రమించిందన్న వార్తతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్‌లు చేశారు వైద్య సిబ్బంది. ఈ పరీక్షల్లో ఆమె సోదరి జోయా మొరానీకి కూడా కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం జోయా ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంకా వీరి తల్లిదండ్రుల రిపోర్టులు రావాల్సి ఉంది. షాజా మొరానీ ఈ మధ్యే విదేశాల నుంచి తిరిగి రాగా… జోయా రాజస్థాన్ నుంచి ముంబై చేరుకున్నట్లు సమాచారం. కాగా షాజా మొరానీ కనికా కపూర్ స్నేహితులు కూడా.
Tags : Bollywood, Kareem Morani, Shazah Morani, Joya Morani, Corona Virus, Covid19