రాజ్ కుంద్రా పోర్న్ కేసు: మీడియాకు షాక్ ఇచ్చిన శిల్పాశెట్టి

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు లో శిల్పాశెట్టికి కూడా సంబంధం ఉందని పలు మీడియాలో కథనాలు వినిపించాయి. దీంతో తన భర్త రాజ్ కుంద్రాతో పాటు తన కుటుంబానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేలా కథనాలు పబ్లిష్ చేశారని ఆరోపిస్తూ మీడియా సంస్థలపై  శిల్పాశెట్టి ముంబై హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. […]

Update: 2021-07-30 01:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు లో శిల్పాశెట్టికి కూడా సంబంధం ఉందని పలు మీడియాలో కథనాలు వినిపించాయి. దీంతో తన భర్త రాజ్ కుంద్రాతో పాటు తన కుటుంబానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేలా కథనాలు పబ్లిష్ చేశారని ఆరోపిస్తూ మీడియా సంస్థలపై శిల్పాశెట్టి ముంబై హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. మొత్తం 29 మీడియా సంస్థలపై ఆరోపణలు చేసిన శిల్పా పలువురు మీడియా ప్రతినిధులపైనా కేసులు వేసింది. ఇక ఈ కేసు శుక్రవారం విచారణకు రానున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ కుంద్రా పై వస్తున్నా ఆరోపణలు నిజమేనంటూ పలువురు హీరోయిన్లు మీడియా ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags:    

Similar News