రెండోసారి తెలంగాణ అల్లుడు కాబోతున్న అమీర్ ఖాన్..?
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలంగాణకు అల్లుడు కాబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. త్వరలోనే అమీర్ మూడో పెళ్ళికి సిద్ధమవుతున్నాడని, రెండో సారి కూడా ఈ ఖాన్ తెలంగాణ అమ్మాయినే వివాహం చేసుకుంటాన్నాడని నెట్టింట్లో గుసగుసలు గుప్పుమన్నాయి. ఇంతకీ ఆ తెలంగాణ అమ్మాయి ఎవరు.. అంటే.. ఇంకెవరు అందరు మాట్లాడే హీరోయిన్ ఫాతిమా సనా షేక్. ఈ హీరోయిన్ కి తెలంగాణ కు సంబంధం ఏంటి..? రెండోసారి అమీర్ […]
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలంగాణకు అల్లుడు కాబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. త్వరలోనే అమీర్ మూడో పెళ్ళికి సిద్ధమవుతున్నాడని, రెండో సారి కూడా ఈ ఖాన్ తెలంగాణ అమ్మాయినే వివాహం చేసుకుంటాన్నాడని నెట్టింట్లో గుసగుసలు గుప్పుమన్నాయి. ఇంతకీ ఆ తెలంగాణ అమ్మాయి ఎవరు.. అంటే.. ఇంకెవరు అందరు మాట్లాడే హీరోయిన్ ఫాతిమా సనా షేక్. ఈ హీరోయిన్ కి తెలంగాణ కు సంబంధం ఏంటి..? రెండోసారి అమీర్ అల్లుడు అవడం ఏంటి..? అంతా కన్ఫ్యూజన్ గా ఉందా..? అయితే వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ విన్నా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విడాకుల మాటే వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనమైంది. 15 ఏళ్లు ఎంతో అనోన్యంగా కాపురం చేసిన ఈ జంట అకస్మాత్తుగా ఎందుకు విడిపోయారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరి విడాకులకు కారణం నటి ఫాతిమా సనా షేక్ అంటూ వస్తున్నా వార్తలు ఇప్పటికీ నెట్టింట్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఫాతిమాసనాషేక్ “దంగల్” అనే సినిమాలో ఇదే అమీర్ ఖాన్ కు కూతురుగా నటించింది. ఇప్పటివరకు సినిమాలతో స్టార్ గా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన ఫాతిమాసనాషేక్, అమీర్ విడాకులకు కారణం అన్న వార్తతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిందంటే ఆశ్చర్యపడక్కర్లేదు.
ఇకపోతే కొద్దీ రోజుల్లో అమీర్, ఫాతిమా వివాహం చేసుకుంటున్నారన్న వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఫాతిమా సనా షేక్ తల్లిదండ్రులది మతాంతర వివాహంకాగా, తండ్రి విపిన్ శర్మ స్వస్థలం జమ్మూ , తల్లి రాజ్ తబుస్సుది శ్రీనగర్, అయితే ఫాతిమా మాత్రం పుట్టింది హైదరాబాద్ నగరంలోనే అంట.. అంటే తెలంగాణ.. మరీ ఈ లెక్కన ఫాతిమాను అమీర్ వివాహమాడితే తెలంగాణకు అల్లుడు అయినట్లేగా.. ఇక రెండోసారి అంటే అమీర్ రెండో భార్య కిరణ్ రావు స్వస్థలం హైదరాబాద్ అని అందరికి తెలిసిన విషయమే.. ఇప్పటికే మొదటిసారి తెలంగాణ అల్లుడైన అమీర్, ఫాతిమాను వివాహం చేసుకొంటే రెండోసారి తెలంగాణ అల్లుడు కానున్నాడనేగా అంటూ నెటిజన్లు కొత్త కొత్త లాజిక్ లతో వార్తలు సృష్టిస్తున్నారు.