బాలీవుడ్ సెలబ్రిటీకి కరోనా
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కోవిడ్ 19 వ్యాధితో బాధపడుతుండగా.. బాలీవుడ్లో ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం తను, తన కుటుంబ సభ్యులు క్వారంటైన్లో ఉన్నామని అధికారికంగా ప్రకటించింది. నాలుగు రోజులుగా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నానని… దీంతో కోవిడ్ 19 టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలిందని వెల్లడించింది. కనికా కొన్ని రోజుల క్రితం ఫారిన్ కు వెళ్లి వచ్చినట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కోవిడ్ 19 వ్యాధితో బాధపడుతుండగా.. బాలీవుడ్లో ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం తను, తన కుటుంబ సభ్యులు క్వారంటైన్లో ఉన్నామని అధికారికంగా ప్రకటించింది. నాలుగు రోజులుగా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నానని… దీంతో కోవిడ్ 19 టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలిందని వెల్లడించింది. కనికా కొన్ని రోజుల క్రితం ఫారిన్ కు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈ మధ్య ఆమె ఓ పార్టీకి కూడా అటెండ్ అయ్యిందని తెలుస్తుండగా… కనీనాతో పాటు మరింత మందికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
సన్నీ లియోన్ ‘రాగిణి ఎంఎంఎస్2’లో ‘బేబి డాల్’ సాంగ్‌తో పాపులర్ అయిన కనికా కపూర్ … కరోనా విజృంభిస్తున్న వేళ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని సూచించింది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరింది. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి ఆలోచించాలని.. అప్పుడే కరోనాను నివారించగలమని చెప్పింది కనికా. కేంద్ర ప్రభుత్వం, వైద్యుల సూచనల ప్రకారం నడుచుకోవాలని… అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జాగ్రత్తలు చెప్పింది.
Tags: Kanika Kapoor, Bollywood, Singer, First Bollywood Celebrity