బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

యూనివర్సల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. మంగళవారం అనారోగ్యంతో ముంబైలోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. 2018 నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న 53 ఏళ్ల ఇర్ఫాన్ మృతి బాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మృతిని తట్టుకోలేకపోతున్నాను అని ట్వీట్ చేశాడు దర్శకుడు సుజిత్ సర్కార్. నా ప్రియమిత్రమా ఇర్ఫాన్… నువు జీవితం మొత్తం పోరాటం చేస్తూనే ఉన్నావు. నీ […]

Update: 2020-04-29 01:54 GMT

యూనివర్సల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. మంగళవారం అనారోగ్యంతో ముంబైలోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. 2018 నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న 53 ఏళ్ల ఇర్ఫాన్ మృతి బాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

ఇర్ఫాన్ మృతిని తట్టుకోలేకపోతున్నాను అని ట్వీట్ చేశాడు దర్శకుడు సుజిత్ సర్కార్. నా ప్రియమిత్రమా ఇర్ఫాన్… నువు జీవితం మొత్తం పోరాటం చేస్తూనే ఉన్నావు. నీ విషయంలో నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. మనం మళ్లీ కలుద్దాం అంటూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశాడు. ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం తెలిపిన ఆయన… ఇర్ఫాన్ సతీమణి పోరాటానికి వందనం తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ కు సెల్యూట్ తో సెలవిస్తూ ట్వీట్ ముగించాడు.

ఇర్ఫాన్ చివరి చిత్రం ఆంగ్రేజీ మీడియం కాగా… ఈ చిత్రంలో బిడ్డను విదేశాల్లో చదివించాలని తపన పడే తండ్రిగా ఇర్ఫాన్ నటన ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుంది. మక్బుల్, పీకు సినిమాల్లో నటనకు విమర్శకులను సైతం మెప్పించిన ఇర్ఫాన్ … పాన్ సింగ్ తోమర్ చిత్రంలో యాక్టింగ్ కు నేషనల్ అవార్డ్ తో సత్కరించబడ్డాడు. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిన ఇర్ఫాన్… సినీ రంగంలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇర్ఫాన్ తల్లి చనిపోయి వారం రోజులు కూడా గడవక ముందే ఇర్ఫాన్ చనిపోవడం కుటుంబీకులను కోలుకోకుండా చేసింది. తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేక పోయినా ఇర్ఫాన్… ఇంతలోనే తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.


Tags: Irfan khan, Bollywood, Shoojit Sircar, Mumbai, Death, Passed away

Tags:    

Similar News