పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం
దిశ, వరంగల్: తెలంగాణ నయాగరగా జలపాతంగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు జలపాతం మత్తడి దుంకుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో ఈ జలపాతం ఉంది. దట్టమైన అడవి మధ్యలో ఈ జలపాతం ఉండటంతో పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ సీజన్‌లో బొగత జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బొగతకు పర్యాటకుల […]
దిశ, వరంగల్: తెలంగాణ నయాగరగా జలపాతంగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు జలపాతం మత్తడి దుంకుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో ఈ జలపాతం ఉంది. దట్టమైన అడవి మధ్యలో ఈ జలపాతం ఉండటంతో పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ సీజన్‌లో బొగత జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బొగతకు పర్యాటకుల రాకను ప్రభుత్వం నిషేదించింది. దీంతో సోషల్ మీడియాలో బొగత అందాలను చూసి మురిసిపోతున్నారు.