విద్యార్థుల 'ఆదర్శం'..

ఎన్ఎంఎంఎస్ జాతీయస్థాయి స్కాలర్‌షిప్‌కు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పదిమంది ఎంపికయ్యారు. 2019-20 విద్యాసంవత్సరంలో నిర్వహించబడిన పరీక్షలో ముత్యం శశి దీప్తి, ముత్యం శృతిలయ, కోల శ్రీలేఖ, అంక శివాని, గౌరీ సుస్మిత, భీమ సరియా, నల్లోల భూమేష్, ఇత్తడి శ్రీథన్ రెడ్డి, పెద్ధివార్ రోహిత్, గడ్డల అనుదీప్‌‌లు తమ ప్రతిభను కనబరిచి ఈ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. వీరు ఈ స్కాలర్షిప్‌‌ను నాలుగేండ్ల పాటు ప్రతిఏడాదీ రూ.12వేల చొప్పున అందుకోనున్నారు. ఈ ఉపకార వేతనాలకు ఎంపిక […]

Update: 2020-02-20 06:42 GMT

ఎన్ఎంఎంఎస్ జాతీయస్థాయి స్కాలర్‌షిప్‌కు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పదిమంది ఎంపికయ్యారు. 2019-20 విద్యాసంవత్సరంలో నిర్వహించబడిన పరీక్షలో ముత్యం శశి దీప్తి, ముత్యం శృతిలయ, కోల శ్రీలేఖ, అంక శివాని, గౌరీ సుస్మిత, భీమ సరియా, నల్లోల భూమేష్, ఇత్తడి శ్రీథన్ రెడ్డి, పెద్ధివార్ రోహిత్, గడ్డల అనుదీప్‌‌లు తమ ప్రతిభను కనబరిచి ఈ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. వీరు ఈ స్కాలర్షిప్‌‌ను నాలుగేండ్ల పాటు ప్రతిఏడాదీ రూ.12వేల చొప్పున అందుకోనున్నారు. ఈ ఉపకార వేతనాలకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ ఎమ్.ఉమేష్ రావు హర్షం వ్యక్తం చేసి ఎంపికైన విద్యార్థులకు మిఠాయిలు తినిపించి అభినందించారు. ఈ స్థాయిలో ఎంపిక అవ్వడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు కుమ్మరి సతీష్‌‌ని ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సాధించినందుకు అధ్యాపకుల బృందాన్ని ప్రశంసించారు.

 

Tags:    

Similar News