బీఎండబ్ల్యూ బైక్‌లకు ఈఎంఐ స్కీమ్
దిశ, వెబ్‌డెస్క్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన ద్విచక్ర వాహన విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad).. జీ310ఆర్ (BMW G310R), జీ310 జీఎస్ (BMW G310GS) మోటార్‌సైకిళ్లకు వాయిదాల్లో చెల్లింపులు చేసే పథకాన్ని ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ (Festive season)లో లాంచ్ చేయనున్న ఈ ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లకు నెలకు రూ.4,500 ఈఎంఐ (EMI) చెల్లించి సొంతం చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ రెండు బైకుల ప్రీ-బుకింగ్‌లను […]
దిశ, వెబ్‌డెస్క్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన ద్విచక్ర వాహన విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad).. జీ310ఆర్ (BMW G310R), జీ310 జీఎస్ (BMW G310GS) మోటార్‌సైకిళ్లకు వాయిదాల్లో చెల్లింపులు చేసే పథకాన్ని ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ (Festive season)లో లాంచ్ చేయనున్న ఈ ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లకు నెలకు రూ.4,500 ఈఎంఐ (EMI) చెల్లించి సొంతం చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ రెండు బైకుల ప్రీ-బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
‘బీఎండబ్ల్యూ ఇండియా అనుకూలమైన చెల్లింపులు, సౌకర్యవంతమైన ఆర్థిక పరిష్కారాలను రూపొందించింది. కొత్త బీఎండబ్ల్యూ జీ310 ఆర్ (BMW G310R), బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ (BMW G310GS)లను సరికొత్త ఆఫర్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ కొత్త బైక్‌లను ఈఎంఐలలో చెల్లించే విధంగా పథకాన్ని రూపొందించినట్టు’ శివపాద రే చెప్పారు.
బైక్‌ల ధరలను ఇంకా ప్రకటించబడనందున, బీఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్లాన్ (BMW Bullet Plan) కింద ఇచ్చే రుణం ఆధారంగా ఈఎంఐ మొత్తం ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో బైక్‌ల లాంచ్‌కి ముందే వినియోగదారులు ప్రీ-అప్రూవ్‌డ్ లోన్లను పొందవచ్చని వెల్లడించింది. కాగా, బీఎస్4 (BS4) మోడల్ జీ 310 ఆర్ (G310R) రూ. 2.99 లక్షలు, జీ 310 జీఎస్ (G310GS) రూ. 3.49 లక్షల ధర ఉన్న సంగతి తెలిసిందే. ఈ మోడల్ బైక్‌లు భారత్‌లోని బీఎండబ్ల్యూ వార్షిక అమ్మకాల్లో 85 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.