దర్గాలో రక్తదానం.. ఎక్కడంటే?

దిశ, చార్మినార్: మిలాదున్నబి సందర్భంగా ఫలక్​నుమాలోని ఖాద్రీచమాన్​దర్గాలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యాకుత్​పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్​లు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఓవైసీ, తలసేమియా, సారాహ్ ఆసుపత్రుల సౌజన్యంతో 40 మంది మెడికల్​సిబ్బంది బృందంతో నిర్వహించిన ఈ శిబిరంలో 1500 మంది స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సోఫి కమిటీ అధికార ప్రతినిధి మౌలానా ఒవలియా హుస్సేనీ ముర్తూజా […]

Update: 2021-10-10 08:29 GMT

దిశ, చార్మినార్: మిలాదున్నబి సందర్భంగా ఫలక్​నుమాలోని ఖాద్రీచమాన్​దర్గాలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యాకుత్​పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్​లు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఓవైసీ, తలసేమియా, సారాహ్ ఆసుపత్రుల సౌజన్యంతో 40 మంది మెడికల్​సిబ్బంది బృందంతో నిర్వహించిన ఈ శిబిరంలో 1500 మంది స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సోఫి కమిటీ అధికార ప్రతినిధి మౌలానా ఒవలియా హుస్సేనీ ముర్తూజా పాషా, ఆలీపాషా, ఛత్రినాక ఇన్​స్పెక్టర్ సయ్యద్​అబ్దుల్​ఖాదర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News