సెల్యూట్ ‘ముథామిల్ సెల్వి’.. భారత సాహసనారి

దిశ, ఫీచర్స్: సమాజ కట్టుబాట్లు అధిగమిస్తూ పలువురు మహిళలు విజయ పతాక ఎగురవేస్తున్నారు. ముఖ్యంగా e-తరం ఆధునిక మహిళలు ఎందులోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తూ స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఈ కోవకు చెందిన మహిళే ముథామిల్ సెల్వి. ఈ రోజు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ సందర్భంలో ముథ్మిల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళనాడులో కాంచిపురం జిల్లా మలైపట్టు గ్రామానికి చెందిన […]

Update: 2021-03-08 05:24 GMT

దిశ, ఫీచర్స్: సమాజ కట్టుబాట్లు అధిగమిస్తూ పలువురు మహిళలు విజయ పతాక ఎగురవేస్తున్నారు. ముఖ్యంగా e-తరం ఆధునిక మహిళలు ఎందులోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తూ స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఈ కోవకు చెందిన మహిళే ముథామిల్ సెల్వి. ఈ రోజు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ సందర్భంలో ముథ్మిల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

తమిళనాడులో కాంచిపురం జిల్లా మలైపట్టు గ్రామానికి చెందిన ముథ్మిల్ సెల్వి ప్రపంచానికి మహిళల ధైర్యసాహసాలు తెలిపేందుకు తన వంతుగా ఏదైనా చేయాలని అనుకునేది కానీ ఎప్పుడూ అందుకు ప్రయత్నించలేకపోయింది. చిన్నప్పుడు అడ్వెంచర్ ట్రై చేయగా పేరేంట్స్ అడ్డుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమెకు మ్యారేజ్ అయింది. అయితే ఆమె తన మనసులో ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్ యూనిక్ అడ్వెంచర్ చేయాలనుకుంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల ముథ్మిల్ చేసిన సాహసాన్ని చూస్తే మీరు ఔరా అనకుండా ఉండలేరు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

కళ్లకు గంతలు కట్టుకుని, 155 అడుగుల ఎత్తయిన పర్వతం నుంచి 58 సెకన్లలో రైడ్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతీయ మహిళగా, అందులోనూ ఇద్దరు పిల్లలకు అమ్మగా ఉంటూ కూడా ఏదో ఒక సాహసం చేయాలని అనుకున్నానని ముథ్మిల్ తెలిపింది. ఈ ఫీట్ ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటానన్నారు. పురుషాలతో సమానంగా మహిళలు ఏదైనా చేయగలరని, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను ఈ అడ్వెంచర్ చేసినట్లు పేర్కొంది. మహిళలను వారి జీవితంలో లక్ష్యాలు సాధించేందుకు పురుషులు తమ వంతు సహకారం, తోడ్పాటు, ప్రోత్సాహం అందించాలని కోరింది ముథ్మిల్. కాగా 155 అడుగుల ఎత్తయిన పర్వతం నుంచి కళ్లకు గంతలు కట్టుకుని వైర్ల ద్వారా రైడ్ పూర్తి చేయడం యూనిక్ ఫీట్ అని, దీనిని యునికో(UNICO) బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రికార్డు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఆర్.శివరామన్ తెలిపారు.

 

Tags:    

Similar News