నర్సంపేటలో పోలీసుల తనిఖీలు.. భారీగా నల్లబెల్లం పట్టివేత

దిశ, నర్సంపేట: మండలంలో గుడుంబా సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా నర్సంపేట మండలంలోని తండాలకు తరలిస్తున్న బెల్లాన్ని పోలీసులు ముత్తోజిపేట శివారులో పట్టుకున్నారు. బెల్లం తరలింపుపై విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పల్ తండా క్రాస్ దగ్గర నర్సంపేట ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీలు చేయగా బెల్లం పటిక పట్టుబడింది. ఈ నేపథ్యంలోనే కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా.. నెల్లికుదురు మండలంలోని […]

Update: 2021-11-05 08:25 GMT

దిశ, నర్సంపేట: మండలంలో గుడుంబా సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా నర్సంపేట మండలంలోని తండాలకు తరలిస్తున్న బెల్లాన్ని పోలీసులు ముత్తోజిపేట శివారులో పట్టుకున్నారు. బెల్లం తరలింపుపై విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పల్ తండా క్రాస్ దగ్గర నర్సంపేట ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీలు చేయగా బెల్లం పటిక పట్టుబడింది. ఈ నేపథ్యంలోనే కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా.. నెల్లికుదురు మండలంలోని నిమ్మతండాకి చెందిన గుగులోత్ నగేష్.. కామారెడ్డి నుంచి 49 బస్తాల్లో బెల్లం, ఐదు బస్తాల్లో పటికను కొనుగోలు చేసి, ఎక్కువ రేటుకు నర్సంపేటలో అమ్మేందుకు వస్తున్నట్టు చెప్పాడు. ఈ తనిఖీల్లో 980 కిలోల బెల్లం, 5 కిలోల పటిక పట్టుబడినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. వీటి విలువ రూ. 68,800 గా ఉంటుదన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టామన్నారు. మండలంలో ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

Tags:    

Similar News