గవర్నర్‌కు సీఎం కేసీఆర్.. క్షమాపణ చెప్పాలి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలసిందే. దీంతో గవర్నర్ కామెంట్స్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందిస్తూ, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం గన్‌పార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలసిందే. దీంతో గవర్నర్ కామెంట్స్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందిస్తూ, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం గన్‌పార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కేసీఆర్ దండు పేరుతో గవర్నర్‌పై ట్రోలింగ్‌ను డీజీపీ అడ్డకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు ఒక పార్టీని అంటకట్టడం నీచమైన చర్య అని గీతా మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.