తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పప్పులుడకవు
దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా దాని పప్పులుడకవని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కడపలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ బొమ్మ పెట్టుకొని ఏమని ఓట్లడుగుతారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చని బీజేపీకి తిరుపతి ఓటర్లు తగు గుణపాఠం చెబుతారన్నారు. ఢిల్లీలో 26న జరిగే ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి ప్రపంచ దేశాలు సైతం మద్దతు తెలుపుతున్నా కేంద్రానికి […]
దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా దాని పప్పులుడకవని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కడపలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ బొమ్మ పెట్టుకొని ఏమని ఓట్లడుగుతారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చని బీజేపీకి తిరుపతి ఓటర్లు తగు గుణపాఠం చెబుతారన్నారు. ఢిల్లీలో 26న జరిగే ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి ప్రపంచ దేశాలు సైతం మద్దతు తెలుపుతున్నా కేంద్రానికి సిగ్గూఎగ్గూ లేకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ కార్పొరేట్ల పక్షమా లేక రైతుల పక్షమో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాజకీయ పార్టీనా లేక కుల పార్టీనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్రగడ కాళ్ల దగ్గరకు తీసుకెళ్లాడన్నారు. ముద్రగడ ఫొటో పెట్టుకొనే బీజేపీ తిరుపతిలో ఓట్లు అడుక్కోవాల్సి వస్తుందేమోనని రామకృష్ణ వ్యాఖ్యానించారు.