తెలంగాణపై కేంద్రం ఫోకస్.. ఇక టీఆర్ఎస్‌కు గడ్డుకాలమేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఫోకస్చేస్తోంది. బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శుక్ర, శనివారాల్లో జరుగునున్నాయి. ఈ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. హైదరాబాద్ పాతబస్తీలోని కాటేదాన్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ దీనికి వేదిక కానుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను తొలుత ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించాలని బీజేపీ శ్రేణులు భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఫోకస్చేస్తోంది. బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శుక్ర, శనివారాల్లో జరుగునున్నాయి. ఈ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. హైదరాబాద్ పాతబస్తీలోని కాటేదాన్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ దీనికి వేదిక కానుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను తొలుత ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించాలని బీజేపీ శ్రేణులు భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కారణంగా పాతబస్తీకి మార్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడులు, రైతులు, నిరుద్యోగులు, దళిత, గిరిజనులు, కార్మికుల సమస్యలపై చర్చలు కొనసాగనున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నారు.
తెలంగాణ సర్కార్హుజురాబాద్ఉప ఎన్నికల్లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామని ఇచ్చిన హామీలపై బీజేపీ నాయకులు పోరాటం చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడంలో కేసీఆర్ ఫెయిల్యూర్‌ను ఎత్తిచూపడమే కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్పులు, రీయింబర్స్మెంట్కల్పించడమే ధ్యేయంగా బీజేపీ తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర సర్కార్వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తోంది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
అంతేకాకుండా పోడు సమస్యపై సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కిసాన్, మహిళా, యువ మోర్చాలు యాక్టివ్రోల్ను కొనసాగిస్తున్నాయి. అలాగే పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు ఈ సమావేశంలో రచించనున్నారు. దీంతో పాటు పార్టీలో చేరికలపై ఫోకస్చేయనున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్నేతలే లక్ష్యంగా ఆపరేషన్ఆకర్ష్ చేపట్టాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
బండి సంజయ్రెండో విడత పాదయాత్రపై సైతం నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయడమే తమ లక్ష్యంగా బీజేపీ నాయకులు పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఉద్యమ కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.