అలాంటి నిర్ణయాలు మోడీకే చెల్లు
దిశ, మెదక్: సంపూర్ణ మెజార్టీతో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడం నూతన అధ్యాయానికి నాంది పలికిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని మోడీకే చెల్లుతుందన్నారు. హిందువుల ఆరాధ్య దైవం రామ మందిర నిర్మాణానికి బీజేపీ కృషితోనే పునాది రాయి పడిందన్నారు. విద్యుత్ రంగంలో పెను మార్పులు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు కేంద్రం కృషి చేసిందన్నారు. […]
దిశ, మెదక్: సంపూర్ణ మెజార్టీతో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడం నూతన అధ్యాయానికి నాంది పలికిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని మోడీకే చెల్లుతుందన్నారు. హిందువుల ఆరాధ్య దైవం రామ మందిర నిర్మాణానికి బీజేపీ కృషితోనే పునాది రాయి పడిందన్నారు. విద్యుత్ రంగంలో పెను మార్పులు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు కేంద్రం కృషి చేసిందన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అత్మనిర్భర్ పథకం ద్వారా లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని పేర్కొన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రం అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.