12 వేల మంది విద్యావాలంటీర్లు పస్తులున్నారు : బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలైనా ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగ యువత అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పడ్డాక ఒక్కసారి కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని […]

Update: 2021-06-01 01:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలైనా ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగ యువత అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పడ్డాక ఒక్కసారి కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేశారని ఆరోపించారు. 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని అన్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా 12 వేల మంది విద్యావాలంటీర్లు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News